మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి చొరవతో విజయవంతంగా చికిత్స..
విశాఖ దక్షిణం,,(స్వతంత్ర ప్రభ)
పుట్టినప్పటి నుండి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చొరవతో పదేళ్ల వరకు అవసరమైన వైద్యాన్ని కేజీహెచ్ డాక్టర్స్ ద్వారా విజయవంతంగా అందించారు. అంతేకాకుండా ఇంటికి వెళ్లి పరామర్శించి సొంత నిధులతో రూ.20 వేల నగదును మెడికల్ ఖర్చులకు అందజేశారు*. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ *కేజీహెచ్ సూపరిండెంట్ సహకారంతో కిడ్నీ వైద్య నిపుణులు గులిపిల్లి ప్రసాద్ బృందం పర్యవేక్షణలో ఆరేళ్ల బాబు వంక గగన్ కి ప్రాణదానం చేశారని హర్షం వ్యక్తం చేశారు*. కిడ్నీ మార్పిడి అనేది చిన్న వయసుల్లో బాబుకి సహకరించదని, ప్రస్తుతానికి ట్యూబ్ ద్వారా పదేళ్ల వరకు బాబుకి ఆరోగ్యవంతమైన జీవనం సాగించేలా విజయవంతమైన వైద్యం అందించిన డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు.బాబు తల్లిదండ్రులు వంక నరేష్ వంక అమ్మాజీ నిరుపేద కుటుంబం కావడంతో వారికి అవసరమైన మందులు ఖర్చులకు తన వంతు సాయం అందించానని వెల్లడించారు. బాబు ఆరోగ్యం పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇటువంటి పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలన్న సదుద్దేశంతోనే నాడు ప్రజల నాడి తెలుసుకున్న వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారన్నారు. ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీలో ఉన్న సంఖ్యను రెట్టింపు చేసి మరింత పేదలకు చేరువ చేశారని వెల్లడించారు*. ప్రజలకు ముఖ్యంగా నాణ్యమైన విద్యా, వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. కానీ కూటమి ప్రభుత్వంలో అది జరగడం లేదని విమర్శించారు. చంద్రబాబుకు, లోకేష్ కేవలం కక్షపూరిత రాజకీయాలతో రగిలిపోతున్నారని మండిపడ్డారు. ప్రజలంతా గమనిస్తున్నారని భవిష్యత్తులో మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో మంచి రోజులు వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ఎస్సీ సెల్ ప్రెసిడెంట్,మాజీ కార్పొరేటర్ చెన్నా జానకిరామ్,జిల్లా వైస్సార్సీపీ వైస్ ప్రెసిడెంట్ రేయ్ డేవిడ్ రాజు, జిల్లా జనరల్ సెక్రటరీ గనగళ్ల రామరాజు, జిల్లా సెక్రటరీ బొడ్డు ఆనంద్, జిల్లా యూత్ వైస్ ప్రెసిడెంట్ గుంటు ఆనంద్, జిల్లా బీసీ సెల్ జనరల్ సెక్రటరీ చోడిపిల్లి శివ,సౌత్ వికలాంగుల విభాగం అధ్యక్షులు గరికన చంద్రశేఖర్, సౌత్ వైస్సార్టఫ్ ప్రెసిడెంట్ సారిక డైవ కుమార్,,వార్డ్ వైస్ ప్రెసిడెంట్ నోళ్లు చంటి, వార్డ్ మహిళా ప్రెసిడెంట్ నిమ్మకాయల ఆదిలక్ష్మి, రోజా, రమణి, జిల్లా మత్స్యకార నాయకులు,జిల్లా నాయకులు, వార్డ్ అధ్యక్షులు,అనుబంధ సంఘాల అధ్యక్షులు, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.





