విశాఖ దక్షిణం, (స్వతంత్ర ప్రభ)
కార్గిల్ విజయ్ దివాస్ ను పురస్కరించుకొని ఈనెల 25 న శనివారం ఉదయం 9:30 గంటల నుండి సుమారు నాలుగు గంటల పాటు యాక్మి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారతీయం పేరట జాతీయ సమైక్యతను చాటి చెప్పే సాంస్కృతిక కార్యక్రమ గోడపత్రికను విశాఖ జిల్లా కోర్టు గౌరవనీయులైన ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు వారి చాంబర్లో ఆవిష్కరించారు. అనంతరం న్యాయమూర్తి వారు మాట్లాడుతూ దేశభక్తి సంబంధించి కార్యక్రమాలు చేపడుతున్న సంస్థలను అభినందిస్తూ,ముఖ్యంగా భారతీయం పేరట నిర్వహిస్తూ కార్గిల్ యుద్ధలో పాల్గొని పోరాడి ప్రాణం విడిచిన సైనికులను స్మరించుకోని వారికీ శ్రద్ధాంజలి ఘటించడం మంచి పరిణయం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలోనే పలు యుద్ధలలో పాల్గొని దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన సైనికుల సతీమణులను గౌరవించి కొంత నగదు ఇచ్చి వారిని సత్కరించుకోవడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన వివిధ పాఠశాలల కళాశాలలో స్టూడెంట్స్ పాల్గొని పలు జాతియ సమైక్యతకు సంబంధించిన నృత్యాలు ప్రదర్శించే కార్యక్రమంలో నగర పౌరులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు.ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో యాక్మి వ్యవస్థాపన అధ్యక్షుడు ప్రతాప్ కుమార్, *ఆప్ సబ్ కి ఆవాజ్* స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి భావిశెట్టి కిరణ్ కుమార్, సంస్థ పెట్రోన్ డా ll పి.సుబ్రహ్మణ్యం( గోల్డ్ మెడలిస్ట్ ఇన్ కార్డియాలజీ) సంస్థ ప్రతినిధులు పుష్పవల్లి (రక్షణ మంత్రి అవార్డు గ్రహీత),రామలక్ష్మి, కౌశిక్ పాల్గొన్నారు.





