విశాఖ దక్షిణం, (స్వతంత్ర ప్రభ)
జీవీఎంసీ సౌత్ జోన్ పరిధిలోని 27వ వార్డు డైమండ్ పార్క్ ప్రాంగణంలో సఫాయి కర్మచారులు మరియు మాన్యువల్ స్కావెంజింగ్ పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో హానరబుల్ చైర్మన్, డి ఎల్ ఎస్.,ఆర్. సన్యాసిరావు, డిప్యూటీ డైరెక్టర్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ రామారావు, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ పి.నల్లనయ్య, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరేష్ కుమార్, జోనల్ కమిషనర్ (సౌత్)ఎం.మల్లయ్య నాయుడు, ఏ ఎం ఓ హెచ్ (సౌత్) డాక్టర్ జె. కృష్ణంరాజు, సఫాయి కర్మచారి సభ్యులు చొక్కాకుల రాంబాబు,పూడి మల్లేశ్వరరావు, నిమ్మకాయల శ్రీనివాసరావు,ఆకుల సుమంతి తదితరులు పాల్గొన్నారు.ఈ అవగాహన కార్యక్రమంలో పారిశుద్ధ్య సిబ్బందికి సఫాయి కర్మచారుల సంక్షేమం, మాన్యువల్ స్కావెంజింగ్ వారి హక్కులు, భద్రతా చర్యలపై అవగాహన కల్పించడం జరిగింది.అనంతరం, పారిశుద్ధ్య కార్యక్రమాల్లో సేవలందిస్తున్న 27వ వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్ బి.నాగరాజు ని సన్మానించడం జరిగింది.





