Connect with us

Hi, what are you looking for?

Andhrapradesh

పలు సమస్యలపై అధికారులకు వినతిపత్రం సమర్పించిన మైలిపిల్లి శ్రీను

విశాఖ దక్షిణం ,(స్వతంత్ర ప్రభ)

దక్షిణ నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారం కోరుతూ 39వ వార్డు పరిధిలోని క్వీన్ మేరీ హై స్కూల్లో శుక్రవారం నిర్వహించిన జిల్లా అధికారుల సమస్యల పరిష్కార సదస్సులో వినతిపత్రాలు సమర్పించారు.ఈ సందర్భంగా విశాఖ పోర్టు అథారిటీ పరిధిలో ఏర్పడుతున్న కాలుష్యాన్ని నివారించేలా చర్యలు చేపట్టాలని, గత పదేళ్లుగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు టిడ్కో గృహాలను తక్షణమే కేటాయించాలని, దక్షిణ నియోజకవర్గంలో రైతు బజార్ను ఏర్పాటు చేయాలని తదితర ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజల సమస్యలను పరిశీలించి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ 39వ వార్డు అధ్యక్షులు మైలిపిల్లి శ్రీను, పార్లమెంట్ ఉపాధ్యక్షులు అబ్దుల్ అనీఫ్, బూత్ అధ్యక్షులు తిత్తి సాయి బలరాం తదితరులు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You May Also Like

AP NEWS

తెలంగాణలో పార్టీ బలోపేతానికి జనసేన వేగంగా అడుగులు వేస్తోందని,ప్రజా సమస్యలపై నిరంతర పోరాటంతో పాటు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పోరాటాల గడ్డగా పేరొందిన...

AP NEWS

ఫుడ్ స్ట్రీట్‌లో ప్రజల మధ్య అల్పాహారం స్వీకరించిన కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తాడేపల్లిగూడెం, జూలై:16(స్వతంత్ర ప్రభ) త్వరలో భీమవరం పాలకొల్లులలో ఈట్ స్ట్రీట్ లను ఏర్పాటు చేయటానికి కృషి చేస్తాను...

BJP

విశాఖపట్నం, జూలై 17 (స్వతంత్ర ప్రభ): మహారాణిపేట పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా బాధ్యతలు చేపట్టిన జి. గోవిందరావును శుక్రవారం బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు...

AP NEWS

కౌన్సిలింగ్‌తో మనోధైర్యం నింపిన పోలీసులు విశాఖ దక్షిణం,(స్వతంత్ర ప్రభ) ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించబోయిన ఓ యువకుడిని వన్‌టౌన్ పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. వన్‌టౌన్...