

మధురవాడ,(స్వతంత్ర ప్రభ)
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బి.పి.సి.ఎల్) తమ వినియోగదారులకు మరింత మెరుగైన ఇంధన అనుభవాన్ని అందించేందుకు ‘స్పీడ్ 100’ (Speed 100) పేరుతో నూతన ప్రీమియం పెట్రోల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తొలిసారిగా మధురవాడలోని బీపీసీఎల్ బంక్‌లో ఈ ప్రాడక్ట్‌ను అధికారికంగా లాంచ్ చేసినట్లు బంక్ డీలర్ మాధవ్ తెలిపారు.ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ, ‘స్పీడ్ 100’ పెట్రోల్ వినియోగం వల్ల వాహనదారులకు అనేక ఉపయోగాలు ఉన్నాయని వివరించారు.మెరుగైన మైలేజ్ & ఇన్ఫర్మేషన్: ఈ ఇంధనంలో వాహనాలకు మంచి మైలేజ్ లభిస్తుంది. ఇంజన్ ఆయుష్షు పెంపు: ఇంజన్ పనితీరు స్మూత్‌గా మారడమే కాకుండా, ఇంజన్ ఆయుష్షు పెరుగుతుంది ఉదాహరణకు ఒక లక్ష కిలోమీటర్లు తిరిగే వాహనం, ఈ పెట్రోల్ ద్వారా 1,20,000 కిలోమీటర్ల వరకు ఎటువంటి బోరింగ్ లేదా ఇతర సమస్యలు లేకుండా నడుస్తుందని పేర్కొన్నారు.ధర వ్యత్యాసం: సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే లీటరుపై దాదాపు వ్యత్యాసం ఉన్నప్పటికీ, వాహనం పై దీని ప్రభావం మరియు ఇచ్చే మైలేజ్ చాలా మెరుగ్గా ఉంటాయని స్పష్టం చేశారు.తెలంగాణలో ఈ ప్రాడక్ట్‌కి లభించిన విశేష ఆదరణ మరియు వినియోగదారుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా దీనిని ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. వాహనదారులు అందరూ ఒకసారి ఈ ‘స్పీడ్ 100’ పెట్రోల్‌ను ఉపయోగించి దాని వ్యత్యాసాన్ని గమనించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్పీడ్ 100 టీం మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు





