ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..
ఎయిర్పోర్ట్ వద్ద ఏర్పాట్లును లైవ్ ఎల్.ఈ.డి ఎల్ఈడి స్క్రీన్ ను ప్రారంభించిన. జిల్లా కలెక్టర్ నిషాంతి. టి

ఏ ఎస్ ఆర్ జిల్లా,,(స్వతంత్ర ప్రభ)
విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన ప్రతిష్టాత్మక “అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్” ను ఆగస్టు 1వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.ఈ చారిత్రాత్మక ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు, రానున్న సందర్భంగా ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో జరుగుతున్న ముమ్మర ఏర్పాట్లను, ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలు తిలకించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ ను జిల్లా కలెక్టర్ నిషాంతి.టి, శనివారం పాడేరు పాత బస్సు స్టాండ్ కూడలిలో అన్నా క్యాంటీన్ ఎదురుగా ఏర్పాటుచేసిన ఏర్పాటు చేసిన ఎల్ ఈడి స్క్రీన్ ను ప్రారంభించారు . ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్ఈడి స్క్రీన్ ప్రదర్శన వీక్షించేందుకు విచ్చేసే ప్రజలు, సందర్శకులు ప్రారంభోత్సవ దృశ్యాలను స్పష్టంగా వీక్షించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసార ఎల్.ఈ.డి స్క్రీన్ ద్వారా ఈ రోజు నుండి ఆగస్టు 1 వ తేది వరకు నిరంతరం ప్రత్యక్ష ప్రచారం జరగాలని కలెక్టర్ ఆదేశించారు.ప్రధాని పర్యటన నేపథ్యంలో విమానాశ్రయ ప్రాంగణంలో జరుగుతున్న కార్యక్రమలు ఎప్పటికప్పుడు ప్రజలు విక్షించేలా సంబంధిత అధికారులను ఆదేశించారు.ప్రారంభోత్సవ వేడుకలను ప్రతి ఒక్కరూ స్పష్టంగా చూసేలా ఎయిర్పోర్ట్ పరిసరాలతో పాటు ప్రధాన కూడలి లో భారీ ఎల్.ఈ.డి స్క్రీన్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ ప్రచారాన్ని అంతరాయం జరగకుండా విద్యుత్ శాఖ, బిఎస్ఎన్ఎల్ వారిని తాగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు..





