ఎ ఎస్ ఆర్ జిల్లా,(స్వతంత్ర ప్రభ)
జిల్లాలో పర్యావరణ పరిరక్షణ, హరిత విప్లవంలో భాగంగా హుకుంపేట మండలం సుకురు గ్రామంలో నిర్వహించిన భారీ వృక్షారోపణ (మొక్కలు నాటే) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిషాంతి. టి పాల్గొని స్వయంగా మొక్కలు నాటారు.వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ) ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం కింద పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో రైతుల పొలాల్లో 30,వేల ఎకరాల్లో రూ.462 కోట్ల అంచనా వ్యయంతో నీడ నిచ్చే తోటలు, పండ్ల మొక్కల నాటె కార్యక్రమాన్ని అల్లూరి జిల్లాలో ఘనంగా ప్రారంభించారు.





