విశాఖపట్నం,(స్వతంత్ర ప్రభ)
విశాఖపట్నం సిటీ పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న 08 మంది సిబ్బందికి పదోన్నతి రాగా, 01 ఏ.సి.పి, ఏ.డి.సి.పి గా, 01 సి ఐ, ఏ.సి.పి గా, 02 ఏ.ఆర్.ఎస్.ఐ లు ,ఆర్.ఎస్.ఐ లుగా, 04 ఏ.ఆర్ కానిస్టేబుళ్లు, ఏ.ఆర్ హెడ్ కానిస్టేబుళ్లు గా పదోన్నతి అందజేయడం జరిగినది. అదే విధముగా ముగ్గురికి కారుణ్య నియామకము క్రింద జూనియర్ అసిస్టెంట్లుగా నియామక పత్రాలు అందజేయడం జరిగినది. డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేసి వారికి పదోన్నతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సత్కరించారు.





