రథయాత్రను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్
విశాఖ దక్షిణం,(స్వతంత్ర ప్రభ)
శ్రీ శ్రీ జగన్నాథ స్వామి వారి తిరుగు రథయాత్ర మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ కార్యక్రమంలో పాల్గొని కొబ్బరికాయ కొట్టి రథయాత్రను ప్రారంభించారు.అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి రథాన్ని భక్తులతో కలిసి లాగారు. చౌట్రీ నుంచి ప్రారంభమైన తిరుగు రథయాత్ర భక్తుల కోలాహలం, ఆధ్యాత్మిక వాతావరణం నడుమ జగన్నాథ స్వామి ఆలయం వరకు సాగింది. స్వామివారి దర్శనం కోసం, రథయాత్రలో పాల్గొనేందుకు అశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ, శ్రీ జగన్నాథ స్వామివారి తిరుగు రథయాత్ర మహోత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించిన నిర్వాహకులకు, భక్తులకు మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.శ్రీ జగన్నాథ స్వామివారి కృపా కరుణాకటాక్షాలతో దక్షిణ నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. స్వామివారి ఆశీస్సులతో దక్షిణ నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ఈ మహోత్సవంలో ఆలయ ఈవో, ఆలయ కమిటీ చైర్మన్ ,సభ్యులు, కూటమి శ్రీనులు ,భక్తులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





