వాసుపల్లి గణేష్ కుమార్ దాతృత్వంపై ఆలయ కమిటీ సభ్యులు హర్షం
విశాఖ దక్షిణం,(స్వతంత్ర ప్రభ)
పేద ప్రజల సాయం అయినా, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సహాయమైన విశాఖలో ముందుగా గుర్తొచ్చే ఒకే ఒక్క నాయకుడు పేరు మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ వైయస్సార్సీపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్. ఆయన నిరంతరం అందించే సేవా కార్యక్రమంలో భాగంగా మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.నగరంలో 104 ఏరియాలో శ్రీ దుర్గాలమ్మవారి జాతరకు లక్ష రూపాయలు విరాళం ఇచ్చారు.104 కార్యాలయంలో ఆదివారం కమిటీ సభ్యులకు సొంత నిధులతో నగదును అందజేశారు. ప్రతి ఏడాది ఈ ఉత్సవాలకు వాసుపల్లి గణేష్ కుమార్ ధన సహాయం అందజేస్తుంటారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికత అలవర్చుకోవాలన్నారు. సేవలోనే నిజమైన సంతృప్తి ఉంటుందని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో, మదర్ తెరిసా లాంటి మహాత్ముల ఆదర్శంగా తీసుకొని తన నిరంతర సేవలు కొనసాగిస్తున్నానని చెప్పారు*. అలాగేదక్షిణ నియోజకవర్గ పేదలకు ఏ కష్టం వచ్చినా తాను ఎప్పుడు అండగా నిలబడుతూ ఉంటానని వెల్లడించారు. అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా విజయవంతంగా జరగాలని వాసుపల్లి గణేష్ కుమార్ ఆకాంక్షించారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి కి ఆయురారోగ్యాలు ప్రసాదించాలనీ అమ్మవారి ఆశీస్సులతో మళ్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రజలకు మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆలయ కమిటీ సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ అందిస్తున్న సహకారం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
గిరిప్రదక్షిణ విజయవంతం కావాలి….ఈనెల 28 , 29న నిర్వహించే గిరిప్రదక్షిణకు సుమారు ఆరు లక్షల మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉందని వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు.పెద్ద సంఖ్యలో వస్తున్న భక్తులకు ఎటువంటి సమస్యలు తెలుచకుండా దేవస్థానం అధికారులు ఇటు అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు.గత ఏడాది నిర్వహించిన గిరిప్రదక్షిణలో కొన్ని లోటుపాట్లు జరిగాయనే ప్రచారం జరిగిందని అన్నారు.ట్రాఫిక్ సమస్యలతో పాటు ఆ భక్తులు కూడా ఇబ్బందులకు గురయ్యారని పేర్కొన్నారు.ఊహించిన దానికంటే ఎక్కువ మంది రావడంతో ఈ సమస్య తలెత్తిందన్నారు.అధికారులు ముందుగా అప్రమత్తమై తగు చర్యలు తీసుకుంటే ఎటువంటి సమస్యలు రావని అన్నారు.ఈ యాడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గిరి ప్రదక్షిణకు చాలా ప్రాధాన్యత ఉందన్నారు.మన రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందన్నారు.ఈ దృష్ట్యా పోలీసు శాఖ ట్రాఫిక్, ఆంక్షలు మళ్లింపులు చేయడం జరిగిందన్నారు.అయితే ప్రణాళిక బద్దంగా పోలీసులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు.భక్తులు మాత్రమే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఇబ్బందులు పడకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు.





