గూడూరు సమన్వయకర్త గురవయ్యకు వాకాడు, కోట, చిట్టమూరు నాయకులను పరిచయం చేసిన… నేదురుమల్లి
పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని సూచన
నెల్లూరు,(స్వతంత్ర ప్రభ )
వైఎస్సార్సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్తగా నూతనంగా నియమితులైన బుదూరు గురవయ్యను వెంకటగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆదివారం వాకాడులోని తన నివాసంలో వాకాడు, కోట, చిట్టమూరు మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, నేదురుమల్లి అభిమానులకు పేరుపేరునా పరిచయం చేశారు.ఈ సందర్భంగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఐక్యంగా ముందుకు సాగి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరినీ కలుపుకొని, సమన్వయంతో పనిచేస్తూ ప్రజల్లో పార్టీని మరింత బలపరిచేలా కృషి చేయాలని గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త బుదూరు గురవయ్యకు సూచించారు.రాబోయే రోజుల్లో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్న లక్ష్యంతో నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని నేదురుమల్లి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





