విశాఖ దక్షిణం, (స్వతంత్ర ప్రభ)
ఐదున్నర సంవత్సరాలుగా గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడిగా ఉండి పోలీసులకు చిక్కకుండా పరారీలో తిరుగుతున్న వ్యక్తిని 1 టౌన్ పోలీసులు అత్యంత చాకచక్యంగా అరెస్టు చేశారు. అనంతరం నిందితుడిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా, కోర్టు రిమాండ్‌కు పంపించింది.ఈ కేసులో నిందితుడిని విజయవంతంగా అరెస్టు చేసినందుకు 1 టౌన్ సీఐ వరప్రసాద్, ఎస్ఐ రవికిరణ్, కానిస్టేబుల్ రవిల సేవలను ఉన్నతాధికారులు అభినందించారు. విధి నిర్వహణలో చూపిన చాకచక్యానికి గుర్తింపుగా నగర పోలీసు కమిషనర్ (సీపీ) వారిని సీపీ రివార్డుతో సత్కరించి ప్రశంసించారు.





